Metpally: కాశిబాగ్ ఆంజనేయ స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా హనుమాన్ మాలధారణ

మెట్‌పల్లి: చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Update: 2026-03-13 05:46 GMT

Metpally: కాశిబాగ్ ఆంజనేయ స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా హనుమాన్ మాలధారణ

మెట్‌పల్లి: చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పట్టణంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ కాశిబాగ్ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్ధ మండల హనుమాన్ మాలధారణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

వ్యాస పూర్ణిమ మరియు హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో, వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు విధుమౌళి శర్మ, సురేందర్ శర్మల ఆధ్వర్యంలో స్వామి వారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి, సింధూర అలంకరణ చేశారు. అనంతరం వృక్ష హారతి సమర్పించి, భక్తిశ్రద్ధలతో నైవేద్యం పెట్టారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. మాలధారణ అనంతరం భక్తులందరూ కలిసి సామూహికంగా 'హనుమాన్ చాలీసా' పారాయణం చేశారు. భక్తుల జయజయధ్వానాలు, హనుమాన్ నామస్మరణతో కాశిబాగ్ ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ వేడుకను దర్శించుకునేందుకు స్థానిక భక్తులు భారీగా తరలివచ్చారు.

Tags:    

Similar News