'ఆరోగ్య తాండూరు - అభివృద్ధి తాండూరు' మన లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపు
తాండూరు: పట్టణాన్ని ఆరోగ్యవంతంగా, అభివృద్ధి పథంలో నిలబెట్టడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
'ఆరోగ్య తాండూరు - అభివృద్ధి తాండూరు' మన లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపు
తాండూరు: పట్టణాన్ని ఆరోగ్యవంతంగా, అభివృద్ధి పథంలో నిలబెట్టడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఉత్సాహంగా 5K రన్:
పాత మున్సిపల్ కార్యాలయం నుండి విలేమూన్స్ చౌరస్తా వరకు సాగిన ఈ పరుగులో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాలను రూపొందించిందని తెలిపారు.
శారీరక, మానసిక దృఢత్వమే ప్రధానం:
"ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిరోజూ వ్యాయామం, నడక, క్రీడలు అవసరం. వీటి వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాండూరును పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజూ ప్రజలను, అధికారులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎమ్మార్వో తారసింగ్, వార్డు కౌన్సిలర్లు, వాకర్స్ టీం సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.