Fire Accident: చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న అను ఫర్నిచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident: చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న అను ఫర్నిచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఫర్నిచర్ మొత్తం దగ్ధం అయ్యింది. ఈ మంటలు పక్కన భవనంలోకి కూడా వ్యాపించాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చెరుకొని మంటలను అదుపు చేశారు. షాట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.