Peddapalli: కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్.. డీసీపీ భూక్య రాంరెడ్డి
Peddapalli: పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండల విద్యార్థులకు డీసీపీ భూక్య రాంరెడ్డి ఇన్స్పైరింగ్ స్పీచ్
Peddapalli
Peddapalli: విద్యార్థులు కష్టపడి చదువితే భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు పెద్దపెల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఆవరణలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. మండలంలోని 229 మంది పదవ తరగతి విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దపెల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి, పెద్దపల్లి ఏసీపి గజ్జి కృష్ణ హాజరయ్యారు.
కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. అనంతరం పదవ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి. విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా ఇన్ని రోజులు చదివిన అంశాలను గుర్తు పెట్టుకొని భయపడకుండా ఏకాగ్రతగా పరీక్షలు రాయాలన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివితేనే రానున్న భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి, పాత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీకొండ రమేష్, మండల విద్య అధికారి రమేష్, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.