Road Accident: నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు దుర్మరణం!

Road Accident: అతివేగం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Update: 2026-03-12 08:43 GMT

Road Accident: నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు దుర్మరణం!

ఆలూర్ (నిజామాబాద్ జిల్లా): అతివేగం ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

నియంత్రణ కోల్పోయి కాల్వలోకి..

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో అతివేగంగా వస్తున్న కారు గుత్ప గ్రామ శివారులోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న పెద్ద బైరి నారాయణ (31) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నారాయణ తండ్రి పేరు భూమయ్య.

మరో యువకుడి పరిస్థితి విషమం

ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో యువకుడు క్యాసెల్ ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ దశరథ్, ఉపసర్పంచ్ చిన్న రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన ప్రవీణ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కేసు నమోదు చేసిన పోలీసులు

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నారాయణకు వృద్ధురాలైన తల్లి ఉంది. చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News