Khammam: ఖమ్మంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై దాడి!
Khammam: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది.
Khammam: ఖమ్మంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై దాడి!
Khammam: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలోని కాంగ్రెస్ అభ్యర్థి రేణుక ఇంటిపై అర్ధరాత్రి సమయంలో బీఆర్‌ఎస్ (BRS) వర్గీయులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది.
ముజ్జుగూడెం గ్రామం బీఆర్‌ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామం కావడంతో, ఈ స్థానిక ఎన్నికలు ఇరు పార్టీలకు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో, అర్ధరాత్రి వేళ బీఆర్‌ఎస్ వర్గీయులు కాంగ్రెస్ అభ్యర్థి రేణుక ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దాడికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి రేణుక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ముజ్జుగూడెం గ్రామానికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, ఘర్షణ వాతావరణాన్ని నియంత్రించేందుకు గ్రామంలో భారీగా గస్తీ ఏర్పాటు చేశారు.
ఈ దాడిపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇరువర్గాలకు చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.