President Droupadi Murmu: శీతాకాల విడిది హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఎప్పుడంటే?

President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్నారు.

Update: 2025-12-08 06:51 GMT

President Droupadi Murmu: శీతాకాల విడిది హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఎప్పుడంటే?

President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్నారు. ఈనెల 17న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ చేరుకోనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు సిద్ధం చేశారు అధికారులు. ఈనెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 20వ తేదీన గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈనెల 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత నిర్వహించే తేనీటి విందులో ఆమె పాల్గొంటారు. ఈనెల 22న ఉదయం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Tags:    

Similar News