Harish Rao: కాంగ్రెస్ ప్రజాపాలన కాదు..నవవంచన పాలన
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బీఆర్‌ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Harish Rao: కాంగ్రెస్ ప్రజాపాలన కాదు..నవవంచన పాలన
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బీఆర్‌ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన 'నవవంచన' పాలనగా మారిందని, ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రోజు ప్రజలను కలుస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజు మాత్రమే ప్రజాదర్భార్‌కు వచ్చి వెళ్లిపోయారు. ప్రజాదర్భార్ పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకుంటా అన్న ముఖ్యమంత్రి, ఆ తరువాత ఒక్కసారి కూడా అటువైపు చూడలేదు. ప్రస్తుతం ప్రజాభవన్ కేవలం జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది తప్ప, ప్రజా సమస్యలు పరిష్కరించే వేదికగా లేదు. ప్రజాభవన్ ను సీఎల్పీ వేదికగా మార్చేశారు.
కాంగ్రెస్ పాలనను 'ప్రజాపాలన కాదు.. నవవంచన పాలన'గా హరీష్ రావు అభివర్ణించారు. రెండేళ్ల పాలనలో కేసీఆర్‌ను తిట్టడం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం సాధించింది? సీఎం రేవంత్ రెడ్డి 'గ్లోబెల్స్' ప్రచారం చేస్తున్నారు తప్ప, వాస్తవంగా ఏమీ సాధించలేదు. రేవంత్ రెడ్డి పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు తగ్గింది? దీనికి ఎవరు బాధ్యులు? అని హరీష్ రావు ప్రశ్నించారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకుని, ప్రభుత్వ పాలనలో ప్రజల కోసం ఏం చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.