Karate Kalyani: బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి
Karate Kalyani: సినీనటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు.
Karate Kalyani: బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి
Karate Kalyani: సినీనటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. ఆదివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు జల్‌పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్, పలువురు సినీ నటులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కళ్యాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, మహిళా మోర్చా జాతీయ నేత ఐశ్వర్యా బిశ్వాల్, గీతామూర్తి, బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.