Jayasudha: బీజేపీలో చేరిన సినీనటి జయసుధ..!

Jayasudha: ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు.

Update: 2023-08-02 11:51 GMT

Jayasudha: బీజేపీలో చేరిన సినీనటి జయసుధ..!

Jayasudha: ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు... తెలంగాణ బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ... తాను ఓ మతపరంగాను, కులపరంగానో పార్టీలో చేరలేదన్నారు. ప్రధాని చేసిన అభివృద్ధి చూసి బీజేపీలో చేరినట్టు చెప్పారు. జాతీయ పార్టీ ద్వారా ఓ మంచి పని చేయాలని పార్టీలో చేరానన్నారు జయసుధ. క్రైస్తవులకు తప్పకుండా మంచి చేస్తానని మాట ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News