Mancherial: తండ్రి, కుమారుడిని బలిగొన్న తాగుబోతు డ్రైవర్

Mancherial: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2023-09-07 10:14 GMT

Mancherial: తండ్రి, కుమారుడిని బలిగొన్న తాగుబోతు డ్రైవర్

Mancherial: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌ మద్యం మత్తులో వ్యాన్‌ను విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొట్టాడు.. వ్యాన్‌ అదుపు తప్పి.. తండ్రి కొడుకులపై బోల్తాపడటంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సాయి భార్య మంజులతో కలిసి పశువుల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కళ్ల ముందే భర్త, కుమారుడిని కోల్పోవడంతో మంజుల రోదనలు అందరిని కంట తడిపెట్టించాయి. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News