Hyderabad: మెరీడియన్‌ స్కూల్‌లో విద్యార్ధికి విద్యుత్‌ షాక్‌

Hyderabad: స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు

Update: 2023-06-30 10:31 GMT

Hyderabad: మెరీడియన్‌ స్కూల్‌లో విద్యార్ధికి విద్యుత్‌షాక్‌

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగింది. లంచ్‌ టైమ్‌లో ఆడుకుంటుండగా ఓ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో ఐరన్‌రాడ్‌ ఉండటంతో విద్యార్థి ప్రమాదానికి గురైనట్టు సమాచారం. ఇప్పటికే వైద్యులు విద్యార్థికి రెండు సర్జరీలు చేసినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు.. స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News