Bicycle: బాలుడి ప్రతిభ.. సైకిల్ హ్యాండిల్‌కు కారు స్టీరింగు..

Bicycle: గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిపెరిగే వారికి అపారమైన తెలివి తేటలుంటాయని ఓ బాలుడిలో కన్పిస్తోంది.

Update: 2023-02-04 05:02 GMT

Bicycle: బాలుడి ప్రతిభ.. సైకిల్ హ్యాండిల్‌కు కారు స్టీరింగు..

Bicycle: గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిపెరిగే వారికి అపారమైన తెలివి తేటలుంటాయని ఓ బాలుడిలో కన్పిస్తోంది. కారులో ప్రయాణించాలని కోరిక... ఆ కారును తానే నడపాలనే భావన ఆ బాలుడిది. ఆశ మంచిదేకానీ... కారు కొనుక్కునే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఆ కారును నడిపే వయసూ లేదు. అయినా... అందుబాటులో ఉన్న వనరులతో ఈ బాలుడు కారును తోలుతున్న భావనతో సైకిల్ తొక్కుతూ అందరినీ ఆశ్చర్య పర్చాడు. కే సముధ్రంలోని ప్రాధమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోన్న నవీన్ కు కారు నడపాలని కోరిక కానీ అతడి కుటుంబానికి కారు కొనే ఆర్థిక స్థోమత లేదు. పైగా అతడికి కారు నడిపే వయసు లేదు, కానీ కారు నడపాలనే తన కోరికను తీర్చుకోవడానికి నవీన్ వినూత్నంగా ఆలోచించాడు.

ఉపాయం ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అంటారు కదా, నవీన్ అదే చేశాడు. తను రోజు నడిపే సైకిల్ కు హ్యాండిల్ తీసేసి దాని స్థానంలో కారు స్టీరింగ్ అమర్చి ఎంచక్కా 'సైకిల్ కారు' తొక్కుకుంటూ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు, సైకిల్ తొక్కుతూ కార్లతో పోటీ పడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నవీన్ సైకిల్ తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవీన్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Tags:    

Similar News