Yousufguda: దారుణం.. ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు

Yousufguda: పది మంది కలిసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం

Update: 2024-02-08 04:31 GMT

Yousufguda: దారుణం.. ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు

Yousufguda: హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాములు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మర్డర్ జరిగిన స్పాట్‌కు చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో పది మంది దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్యకు గురైన రాములు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీలో చేరారు రాములు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Tags:    

Similar News