Nandyala: దడ పుట్టిస్తున్న ఎలుగుబంటి

Nandyala: ఎంప్లాయిస్ కాలనీలో సంచరిస్తున్న ఎలుగుబంటి..

Update: 2023-09-04 02:42 GMT

Nandyala: దడ పుట్టిస్తున్న ఎలుగుబంటి

Nandyala: నంద్యాల జిల్లా మహానంది ప్రజలు ఎలుగుబంటి భయంతో వణికిపోతున్నారు. గత మూడు రోజులుగా ఎలుగుబంటి సంచారం ప్రజానీకాన్ని దడపుట్టిస్తోంది. ఎంప్లాయిస్ కాలనీలో సంచరిస్తున్న ఎలుగుబంటి.. ప్రజానీకాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఎలుగుబంటి సంచార విషయాన్ని అటవీశాఖాధికారులకు విన్నవించినా... పట్టుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

గతంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు అటవీశాఖాధికారి కాగా... మరొకరు సామాన్య రైతు ఎలుగుబంటిదాడిలో మృత్యువాతపడ్డారు. ఆఘటనను గుర్తుచేసుకుని ఆందోళనకు చెందుతున్న స్థానికులు.

Tags:    

Similar News