Karimnagar: 15 ఏళ్ల మైనరు బాలుడిపై లైంగిక దాడి.. ట్యూటర్‌కు దేహశుద్ధి..
Karimnagar: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒప్పుకున్న ట్యూటర్
Karimnagar: 15 ఏళ్ల మైనరు బాలుడిపై లైంగిక దాడి.. ట్యూటర్‌కు దేహశుద్ధి
Karimnagar: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు హాస్టల్‌లో ట్యూటర్ బాలుర పట్ల లైంగిక దాడికి పాల్పడిన విషయం వెలుగు చూసింది. పిల్లలకు పాఠాలు బోధిస్తూనే ట్యూటర్ వెకిలిచేష్టలకు బాలురు భయాందోళనకు గురయ్యారు.
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ట్యూటర్‌ను పట్టుకుని బాలుడి బంధువులు దేహశుద్ధి చేశారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పోలీసుల విచారణలో ట్యూటర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హాస్టల్‌లో ఐదుగురు బాలురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ట్యూటర్ ఒప్పుకున్నాడు.