మేడారం మినీ జాతర ముగింపు సమయంలో కరోనా కలకలం image(the hans india)
Medaram Jathara: మేడారం మినీ జాతరలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధుల్లో ఉన్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడుతున్నారు. సహ ఉద్యోగులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. మహా జాతరకు వచ్చినట్లే చిన్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారానికి భారీగా చేరుకుంటున్నారు.