Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలో నీటిపాలైన పంటపొలాలు

Adilabad: *నిపాని గ్రామ శివారులో 1200 ఎకరాల్లో పంట నష్టం *వేర్లతో పాటా కొట్టుకు పోయిన పంట

Update: 2021-09-12 12:00 GMT

ఆదిలాబాద్ జిల్లాలో నీట మునిగిన పంటలు (ఫోటో ది హన్స్ ఇండియా )

Adilabad: ఇటివల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలో పంట పొలాలు తుడుచుపోయాయి. ఇక్కడ పూర్తిగా కొట్టుకుపోయిన పంట దృశ్యాలు తాంసి మండలంలోని నిపాని గ్రామంలోనివి. ఇటీవల ఏకాధాటిగా కురిసిన వర్షాలు, పెనుగాలుల దాటికి గ్రామం శివారు ప్రాంతంలోని 1200 ఎకరాల్లో పంట మొత్తం వేర్లతో సహా కొట్టుకు పోవడంతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు.

ఇటివల కురిసిన భారీవర్షాలకు జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. దీంతో అధిక దిగుబడుల కొరకు అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టిన రైతులకు చివరికి కన్నీల్లే మిగిలాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే నష్టపోయిన రైతుల వ్యవసాయ క్షేత్రాలలో సర్వే చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. 

Tags:    

Similar News