Hyderabad: కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..

Hyderabad: గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు మాత్రం కరోనా మహమ్మారిని జయించారు.

Update: 2021-05-13 00:43 GMT

110 Years old man:(File Image) 

Hyderabad: గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు మాత్రం కరోనా మహమ్మారిను జయించారు. అద్భుతంగా వుంది కదా అవునండి. పూర్తి వివరాల్లోకి వెళితే... తెలంగాణ కోవిడ్ ఆస్పత్రి గాంధీలో అద్భుతం జరిగింది. 110 ఏళ్ల రామానందతీర్థ 18 రోజుల పాటు చికిత్స పొంది, కోలుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు బుధవారం వెల్లడించారు. అంత వయస్సున్న వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం దేశంలో ఇదే ప్రథమమని రాజారావు పేర్కొన్నారు.

రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆయన ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరే సమయంలో రామానంద తీర్థ ఆక్సిజన్ లెవెల్స్ 92 పాయింట్లుగా ఉంది. అప్పటి నుంచీ ఆయనకు ఐసీయూ వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. ఐతే దాదాపు మూడు వారాల చికిత్స తర్వాత రామానంద కరోనా నుంచి కోలుకున్నారు.

ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో బుధవారం ఆయనకు మరోసారి కరోనా పరీక్ష చేశారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చింది. రామానంద తీర్థుకు ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. అయితే మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని తెలిపారు. ఆయనను సాధారణ వార్డుకు మారుస్తామని.. పూర్తిగా కోలుకునే వరకు గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News