Hyundai : హ్యుందాయ్ నుంచి పండుగ ఆఫర్.. రూ. 8 లక్షల లోపే ఎక్స్‌టర్ కొత్త వేరియంట్ లాంచ్
Hyundai : హ్యుందాయ్ నుంచి పండుగ ఆఫర్.. రూ. 8 లక్షల లోపే ఎక్స్‌టర్ కొత్త వేరియంట్ లాంచ్
Hyundai : హ్యుందాయ్ నుంచి పండుగ ఆఫర్.. రూ. 8 లక్షల లోపే ఎక్స్‌టర్ కొత్త వేరియంట్ లాంచ్
Hyundai : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ను కొత్త ప్రో ప్యాక్ యాక్సెసరీ ప్యాకేజీతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ప్యాకేజీలో కారుకు స్పోర్టీ ఎక్స్‌టీరియర్ లభించింది. ఈ కొత్త వేరియంట్ ధర సాధారణ వేరియంట్ల కంటే కేవలం రూ. 5,000 ఎక్కువ. కొత్త ప్రో ప్యాక్ ఎస్+ ట్రిమ్‌ల నుండి అందుబాటులో ఉంటుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రో ప్యాక్ వేరియంట్‌లో కొత్త సైడ్ సిల్ గార్నిష్, వీల్ ఆర్చెస్ క్లాడింగ్ ఉన్నాయి. ఈ ప్రో ప్యాక్‌లో భాగంగా టైటాన్ గ్రే మ్యాట్ అనే కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ కూడా ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఇదివరకు ఎస్‌ఎక్స్ టెక్ , ఎస్‌ఎక్స్ కనెక్ట్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న డాష్‌క్యామ్ ఇప్పుడు ఎస్‌ఎక్స్ (ఓ) ఏఎమ్‌టి ట్రిమ్‌లో కూడా లభిస్తుంది. ఈ మోడల్‌లో ఇతర మార్పులు ఏమీ చేయలేదు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 హార్స్ పవర్, 114 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, వెన్యూలో కూడా ఉపయోగిస్తారు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి ఉన్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 69 హార్స్ పవర్, 95.2 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ మాన్యువల్, ఏఎమ్‌టి వేరియంట్లు 19.4 కిమీ/లీ, 19.2 కిమీ/లీ మైలేజ్ ఇస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ కిట్‌తో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 27.10 కిమీ/కేజీ మైలేజ్ ఇస్తుంది.
హ్యుందాయ్ కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. "ఎక్స్‌టర్ ప్రో ప్యాక్ వినియోగదారులకు బోల్డ్ స్టైల్, అడ్వాన్సుడ్ టెక్నాలజీ, మంచి సేఫ్టీతో కూడిన కాంబినేషన్‌ను అందిస్తుంది" అని అన్నారు. ఈ కొత్త లుక్, ఫీచర్లతో ఈ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తమ పట్టును మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కొత్త ఎక్స్‌టర్ ఇప్పుడు పదికి పైగా కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వీటిలో అట్లాస్ వైట్, ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, స్టారీ నైట్, కాస్మిక్ బ్లూ, అబిస్ బ్లాక్ వంటి రంగులు ఉన్నాయి.