Vivo T5x 5G: స్మార్ట్‌ఫోన్ చరిత్రలో బిగ్గెస్ట్ బ్యాటరీ! 7,200mAh పవర్‌తో వస్తున్న VivoT5x5G.. ధర ఎంతంటే!
Vivo T5x 5G India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో బంపర్ ఆఫర్.. మార్చి 17న భారత్‌లోకి 7,200mAh భారీ బ్యాటరీతో 'వివో T5x 5G' లాంచ్ కానుంది. ఈ సెగ్మెంట్‌లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ, ఐపీ69 రేటింగ్, డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర, ఫీచర్లు, సేల్ వివరాలు ఈ స్టోరీలో చూడండి.
Vivo T5x 5G: స్మార్ట్‌ఫోన్ చరిత్రలో బిగ్గెస్ట్ బ్యాటరీ! 7,200mAh పవర్‌తో వస్తున్న VivoT5x5G.. ధర ఎంతంటే!
Vivo T5x 5G India Launch: చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం వివో (Vivo) తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వివో T5x 5Gని వచ్చే వారం భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రాబోతోందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఎక్కడ దొరుకుతుంది, ఎంత ధర, ఫీచర్లు ఏంటి అనే పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
లాంచ్ ఎప్పుడంటే..
వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 17న మధ్యాహ్నం 12 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ కానుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు అధికారిక రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.
ప్రధాన ఫీచర్లు ఇవే:
* వివో ఈ ఫోన్‌ను ఏకంగా 7,200mAh బ్యాటరీతో రిలీజ్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ పేర్కొంది. దీనివల్ల గేమింగ్, స్ట్రీమింగ్ చేసే వారికి బ్యాటరీ టెన్షన్ ఉండదు. దీనికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
* ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో (MediaTek Dimensity 7400 Turbo) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
* మన్నిక విషయంలో వివో ఎక్కడా తగ్గలేదు. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో వస్తోంది. అంటే వాటర్‌లో పడినా, డస్ట్ చేరినా ఫోన్‌కు ఏమీ కాదు.
* ఆండ్రాయిడ్ 16.. OrigiOS 6తో ఈ ఫోన్ పని చేయబోతుంది.
ధర ఎంత ఉండొచ్చంటే..
ప్రస్తుతం కంపెనీ ఇస్తున్న టీజర్లను బట్టి చూస్తుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.50 వేల లోపు ఉండే అవకాశం ఉంది. అయితే ఫైనల్ ధర ఎంత అనేది మార్చి 17న అధికారికంగా రివీల్ కానుంది. మొత్తానికి భారీ బ్యాటరీ, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ ప్రేమికులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.