iPhone 16: ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూ.50 వేలలోపే..
iPhone 16: ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఈ లేటెస్ట్ ఫోన్‌ను రూ.50,000 లోపే ఎలా పొందాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
iPhone 16
iPhone 16: మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే కరెక్ట్ టైం. సరికొత్త ఐఫోన్ 17 మార్కెట్లోకి వచ్చినప్పటికీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో అలరిస్తున్న iPhone 16 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిపితే ఈ ప్రీమియం ఫోన్‌ను మీరు ఊహించని ధరకు సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకోండి..
రూ.50 వేల కంటే తక్కువ ధరకే ఎలా పొందాలంటే..
ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 16 (128GB) వేరియంట్ ప్రస్తుతం రూ.61,900 కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 కాగా, దీనిపై నేరుగా 11 శాతం తగ్గింపు లభిస్తోంది. ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై ఇంతటి భారీ డిస్కౌంట్ రావడం ఇదే మొదటిసారి. ఈ డీల్‌ను మరింత లాభదాయకంగా మార్చుకోవడానికి మీకు రెండు మార్గాలు ఉన్నాయని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే.. బ్యాంక్ ఆఫర్లు.. మీరు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే దీనిపై అదనంగా రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సెకండ్ ఆప్షన్.. ఎక్స్ఛేంజ్ డీల్. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాదాపు రూ.20,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే, iPhone 16 ఎఫెక్టివ్ ధర సులభంగా రూ.50,000 లోపు పడిపోతుంది.
iPhone 16 ఎందుకు బెస్ట్ ఛాయిస్ అంటే..
ఇందులో ఉన్న సరికొత్త ఆపిల్ A18 చిప్, 8GB RAM ఫోన్‌ను చాలా వేగంగా ఉంచుతాయి. గేమింగ్ అయినా, మల్టీ టాస్కింగ్ అయినా చాలా స్మూత్‌గా ఉంటుంది. తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలు తీయగల 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దీని సొంతం. అలాగే కొత్తగా వచ్చిన 'కెమెరా కంట్రోల్ బటన్' ఫోటోగ్రఫీని మరింత సులభతరం చేస్తుంది. వీటితో ఆపిల్ తన ఫోన్‌లకు చాలా ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కొన్నా.. మరో 4-5 ఏళ్ల పాటు మీకు కొత్త ఫోన్ ఫీలింగ్ కలుగుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారాలని చూస్తున్నా లేదా తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఐఫోన్ కావాలనుకున్నా.. 2026లో కూడా ఐఫోన్ 16 ఒక బెస్ట్ ఆప్షన్‌గా సూచిస్తున్నారు. ఈ ఫోన్ కొనాలని అనుకుంటే ఫ్లిప్‌కార్ట్ డీల్ ముగిసేలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు.