Best Mobiles: రూ. 20వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ప్రీమియం లుక్స్ తోపాటు అదిరిపోయే ఫీచర్లు..
Best mobiles under 20000 India: భారత మార్కెట్‌లో రూ.20,000లోపు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ఇప్పుడు అత్యంత పోటీగా మారింది. ఈ ధరలోనే మంచి పనితీరు, ప్రీమియం డిజైన్, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. పోకో, మోటరోలా, CMF వంటి బ్రాండ్లు ఈ సెగ్మెంట్‌లో వినియోగదారులకు మంచి ఎంపికలను అందిస్తున్నాయి.
Best Mobiles: రూ. 20వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ప్రీమియం లుక్స్ తోపాటు అదిరిపోయే ఫీచర్లు..
Best mobiles under 20000 India: మార్కెట్ లోకి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, జనాలను ఆకట్టుకోవడంలో మాత్రం కొన్నే సక్సెస్ అవుతున్నాయి. ఇటు బడ్జెట్ లోనూ, అటు ఫీచర్లలోనూ అలరించే ఫోన్లు కొన్ని మాత్రమే ఉంటున్నాయి. వీటిలో మనకు నచ్చిన ఫోన్ ఎంచుకోవాలంటే మాత్రం చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల సంవత్సరాల్లో స్మార్ట్‌ఫోన్ భాగాల ధరలు భారీగా పెరగడంతో బడ్జెట్ సెగ్మెంట్ కూడా మారిపోయింది. ఒకప్పుడు రూ.15,000లో లభించిన ఫీచర్లు ఇప్పుడు రూ.20,000 సెగ్మెంట్‌లో కనిపిస్తున్నాయి.
దీంతో ఈ ధరలో లభించే ఫోన్లు మంచి పనితీరుతోపాటు, ప్రీమియం డిజైన్, దీర్ఘకాల బ్యాటరీ వంటి ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 2025లో విడుదలైన కొన్ని ఫోన్లు ఇప్పుడు ధరలు బాగా తగ్గాయి. ఈ ప్రీమియం ఫోన్ల కోసం డిమాండ్ కూడా భారీగానే ఉంది. మీరు కూడా రూ. 20వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఫోన్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ లిస్ట్ లో ఏయే ఫోన్లు ఉన్నాయో ఓసారి చూద్దాం.
Moto G96 – ప్రీమియం లుక్‌తో బడ్జెట్ ఫోన్.. (రూ. 18,999)
మోటరోలా Moto G96 ఈ సెగ్మెంట్‌లో అద్భుత ఫీచర్లతో మంచి ఎంపికగా నిలుస్తుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మోటో G96 ఒక మంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ లోపాలు ఫోన్ ప్రధాన ఫీచర్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బడ్జెట్ ధరలో ఉన్నప్పటికీ, డిజైన్, డిస్‌ప్లే ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఫాక్స్ లెదర్ టెక్స్చర్ ఉండటంతో ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. ఇది 144Hz కర్వ్డ్ pOLED డిస్‌ప్లేతో వస్తుంది. Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో ఇటు మల్టీటాస్కింగ్, అటు సాధారణ గేమింగ్‌కు మంచి పనితీరు అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ ఒక రోజు కంటే ఎక్కువ సేపు పనిచేస్తుంది. అయితే సాఫ్ట్‌వేర్ అప్డేట్లు కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉండటం చిన్న లోపంగా భావిస్తున్నారు.
పాలీకార్బోనేట్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ, దీనికి IP68 రేటింగ్ ఉంది. ఇందులో అందించిన 50 ఎంపీ కెమెరాతో పగటి పూట ఫోటోలు చాలా బాగుంటాయి. లో లైట్ లో మాత్రం ఫర్వాలేదనిపిస్తాయి.
Moto G96 ఫీచర్లు..
డిస్‌ప్లే (Display) - 6.67-అంగుళాలు
రిజల్యూషన్ (Resolution) - 2400x1080 పిక్సెల్స్
ప్రాసెసర్ (Processor) - క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 (Qualcomm Snapdragon 7s Gen 2)
ఫ్రంట్ కెమెరా (Front Camera) - 32-మెగాపిక్సెల్
రియర్ కెమెరా (Rear Camera) - 50-అల్ట్రాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్
ర్యామ్ (RAM) - 8GB
స్టోరేజ్ (Storage) - 128GB, 256GB
బ్యాటరీ సామర్థ్యం (Battery Capacity) - 5500mAh
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) - ఆండ్రాయిడ్ 15 (Android 15)
Moto G67 Power – భారీ బ్యాటరీ ప్రత్యేకత.. (రూ. 16,999)
Moto G67 Powerలో ప్రధాన ఆకర్షణ 7,000mAh భారీ బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజులు సులభంగా పనిచేస్తుంది. Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది. అయితే డిస్‌ప్లే, కెమెరా పనితీరు ఈ సెగ్మెంట్‌లో సాధారణ స్థాయిలోనే ఉంది.
Moto G67 Power ఫీచర్లు..
డిస్‌ప్లే (Display) - 6.70-అంగుళాలు
రిజల్యూషన్ (Resolution) - 2400x1080 పిక్సెల్స్
ప్రాసెసర్ (Processor) - క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 (Qualcomm Snapdragon 7s Gen 2)
ఫ్రంట్ కెమెరా (Front Camera) - 32-మెగాపిక్సెల్
రియర్ కెమెరా (Rear Camera) - 50-మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్
ర్యామ్ (RAM) - 8GB
స్టోరేజ్ (Storage) - 128GB
బ్యాటరీ సామర్థ్యం (Battery Capacity) - 7000mAh
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) - ఆండ్రాయిడ్ 15 (Android 15)
Motorola Edge 60 Fusion – మిడ్‌రేంజ్ ఫీచర్లు.. (రూ. 19,999)
Motorola Edge 60 Fusion ధర తగ్గడంతో ఇప్పుడు రూ.20,000 సెగ్మెంట్‌లో మంచి డీల్‌గా మారింది. 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లే, MediaTek Dimensity 7400 ప్రాసెసర్, IP68, IP69 రేటింగ్ వంటి ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటుంది. కెమెరా పనితీరు కూడా మంచి స్థాయిలో ఉంటుంది.
Motorola Edge 60 Fusion ఫీచర్లు..
డిస్‌ప్లే (Display) - 6.70-అంగుళాలు
రిజల్యూషన్ (Resolution) - 1220x2712 పిక్సెల్స్
ప్రాసెసర్ (Processor) - మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400)
ఫ్రంట్ కెమెరా (Front Camera) - 32-మెగాపిక్సెల్
రియర్ కెమెరా (Rear Camera) - 50-మెగాపిక్సెల్ + 13-మెగాపిక్సెల్
ర్యామ్ (RAM) - 8GB, 12GB
స్టోరేజ్ (Storage) - 128GB, 256GB
బ్యాటరీ సామర్థ్యం (Battery Capacity) - 5500mAh
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) - ఆండ్రాయిడ్ 15 (Android 15)
CMF Phone 2 Pro – క్లీన్ సాఫ్ట్‌వేర్.. (రూ. 18,999)
CMF Phone 2 Pro ప్రత్యేకమైన డిజైన్, బ్లోట్‌వేర్ లేని సాఫ్ట్‌వేర్ అనుభవంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. 120Hz డిస్‌ప్లే, MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీతో ఒక రోజు సులభంగా ఉపయోగించవచ్చు.
CMF Phone 2 Pro ఫీచర్లు..
డిస్‌ప్లే (Display) - 6.77-అంగుళాలు
రిజల్యూషన్ (Resolution) - 1080x2400 పిక్సెల్స్
ప్రాసెసర్ (Processor) - మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో (MediaTek Dimensity 7300 Pro)
ఫ్రంట్ కెమెరా (Front Camera) - 16-మెగాపిక్సెల్
రియర్ కెమెరా (Rear Camera) - 50-మెగాపిక్సెల్ + 50-మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్
ర్యామ్ (RAM) - 8GB
స్టోరేజ్ (Storage) - 128GB, 256GB
బ్యాటరీ సామర్థ్యం (Battery Capacity) - 5000mAh
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ఆండ్రాయిడ్ 15 - (Android 15)
Poco M8 5G, Poco X7 – మంచి పనితీరు.. (రూ. 17,999)
Poco M8 5G ఈ ఏడాది విడుదలైన ఫోన్. Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో సాధారణ వినియోగం, మిడ్ లెవల్ గేమింగ్‌కు చక్కగా వాడుకోవచ్చు. ఇక Poco X7లో Dimensity 7300 Ultra ప్రాసెసర్, 5,500mAh బ్యాటరీ ఉండటంతో గేమింగ్, రోజువారీ వినియోగానికి మంచి ఎంపికగా నిలుస్తుంది.
Poco X7 ఫీచర్లు..
డిస్‌ప్లే (Display) - 6.67-అంగుళాలు (6.67-inch)
ఫ్రంట్ కెమెరా (Front Camera) - 20-మెగాపిక్సెల్
రియర్ కెమెరా (Rear Camera) - 50-మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్
ర్యామ్ (RAM) - 8GB
స్టోరేజ్ (Storage) - 128GB, 256GB
బ్యాటరీ సామర్థ్యం (Battery Capacity) - 5500mAh
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) - ఆండ్రాయిడ్ 14 (Android 14)
Poco M8 5G ఫీచర్లు..
డిస్‌ప్లే (Display) - 6.77-అంగుళాలు
రిజల్యూషన్ (Resolution) - 1080x2392 పిక్సెల్స్
ప్రాసెసర్ (Processor) - క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (Qualcomm Snapdragon 6 Gen 3)
ఫ్రంట్ కెమెరా (Front Camera) - 20-మెగాపిక్సెల్
రియర్ కెమెరా (Rear Camera) - 50-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్
ర్యామ్ (RAM) - 6GB, 8GB
స్టోరేజ్ (Storage) - 128GB, 256GB
బ్యాటరీ సామర్థ్యం (Battery Capacity) - 5520mAh
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) - ఆండ్రాయిడ్ 15 (Android 15)