iQOO Z11x launch India: 7200mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా.. ఫీచర్లతోనే ఫిదా చేస్తోన్న బాహుబలి ఫోన్.. ధరెంతంటే

iQOO Z11x launch India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో iQOO మరో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. భారీ 7200mAh బ్యాటరీ, సోనీ 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో iQOO Z11x భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్ భారీ బ్యాటరీతో ఆకట్టుకుంటోంది.

Update: 2026-03-12 15:30 GMT

iQOO Z11x launch India: 7200mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా.. ఫీచర్లతోనే ఫిదా చేస్తోన్న బాహుబలి ఫోన్.. ధరెంతంటే

iQOO Z11x launch India: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO భారత మార్కెట్‌లో కొత్త iQOO Z11x స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీర్ఘకాల బ్యాటరీతోపాటు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించడం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, అలాగే IP68, IP69+ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ప్రకారం బీభత్సంగా వాడినప్పటికి ఈ ఫోన్ బ్యాటరీ రెండు రోజుల వరకు పనిచేస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్..

iQOO Z11xలో 6.76 అంగుళాల పెద్ద LCD డిస్‌ప్లే అందించారు. ఇది 1080×2344 పిక్సెల్స్ FHD+ రిజల్యూషన్తో వస్తుంది.

స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. అలాగే సూర్యరశ్మిలో కూడా స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంది.

పవర్ ఫుల్ ప్రాసెసర్, మంచి పనితీరు..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7400 Turbo చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm ప్రాసెస్‌పై ఆధారితమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.

మల్టీటాస్కింగ్, గేమింగ్ సమయంలో కూడా ఫోన్ వేడెక్కకుండా మంచి పనితీరు అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6 పై పనిచేస్తుంది.

కంపెనీ ప్రకారం ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల OS అప్డేట్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి.

సోనీ కెమెరా సెటప్..

iQOO Z11xలో 50MP Sony IMX852 ప్రధాన కెమెరా అందించారు. దీంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది.

ఇందులో 2MP బోకే లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ముఖ్యంగా ఫ్రంట్, రియర్ కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే వీడియో క్వాలిటీ కోసం EIS టెక్నాలజీ కూడా ఉంది.

భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్..

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 7200mAh భారీ బ్యాటరీ. ఇది సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

అదనంగా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ త్వరగా చార్జ్ అవుతుంది.

ధర, లాంచ్ ఆఫర్లు..

iQOO Z11xను మూడు వేరియంట్లలో విడుదల చేశారు.

6GB + 128GB – రూ. 18,999

8GB + 128GB – రూ. 20,999

8GB + 256GB – రూ. 22,999

ఈ ఫోన్ విక్రయాలు మార్చి 16, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon, iQOO అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయి. Axis Bank లేదా SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Tags:    

Similar News