Xiaomi 17 Ultra: ఆ ఫీచర్ తో రిలీజైన ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనంట.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?
Xiaomi 17 Ultra price India: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో Xiaomi కొత్త ఫ్లాగ్‌షిప్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. Xiaomi 17 Ultra పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో Leica 1-ఇంచ్ కెమెరా సెన్సార్, శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 16GB RAM వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర, సేల్ తేదీ వివరాలు ఇప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Xiaomi 17 Ultra: ఆ ఫీచర్ తో రిలీజైన ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనంట.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?
Xiaomi 17 Ultra launch India: చైనా టెక్ దిగ్గజం Xiaomi భారత మార్కెట్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 17 Ultraను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను Xiaomi 17 స్టాండర్డ్ మోడల్‌తో కలిసి లాంచ్ చేశారు. ఇది ప్రపంచ మార్కెట్‌లో మొదటగా ఫిబ్రవరి 28న MWC బార్సిలోనా ఈవెంట్‌లో పరిచయం చేశారు. ఇప్పుడు భారత మార్కెట్‌లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.
కంపెనీ ప్రకారం Leica 1-ఇంచ్ LOFIC సెన్సార్ ఉన్న ప్రపంచంలోని తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అని పేర్కొంది.
ధర, సేల్ ప్రారంభమయ్యే తేదీ..
భారతదేశంలో Xiaomi 17 Ultra ధర రూ. 1,39,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
16GB RAM + 512GB స్టోరేజ్..
లాంచ్ ఆఫర్‌గా SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అదనంగా మార్చి 13 నుంచి 17 వరకు ఉన్న ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో Xiaomi Professional Photography Kit Pro (రూ. 19,999 విలువ) ఉచితంగా అందిస్తారు.
ఈ ఫోన్ మార్చి 18 నుంచి Amazon, Xiaomi అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇది నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్..
Xiaomi 17 Ultraలో 6.9-ఇంచ్ HyperRGB OLED డిస్‌ప్లే ఉంది.
ప్రధాన ఫీచర్లు:
120Hz రిఫ్రెష్ రేట్
300Hz టచ్ సాంప్లింగ్ రేట్
3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
HDR+, Dolby Vision సపోర్ట్
అదనంగా Xiaomi Shield Glass 3.0 ప్రొటెక్షన్ అందించారు. Wet Touch టెక్నాలజీతో తడి చేతులతో కూడా స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు.
ప్రాసెసర్, పనితీరు..
ఈ ఫోన్‌లో 3nm ఆధారిత Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ అందించారు.
అలాగే, ల్యాగ్ ఫ్రీ పనితీరు కోసం 2 హై-పర్ఫార్మెన్స్ కోర్లు (4.6GHz వరకు), 6 ఎఫిషియెన్సీ కోర్లు (3.62GHz వరకు)తోపాటు అదనంగా Adreno GPU, Qualcomm AI Engine అందించారు.
16GB LPDDR5X RAM, 512GB UFS 4.1 స్టోరేజ్‌తో ఈ ఫోన్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. అలాగే IP68 రేటింగ్ ఉండటంతో నీరు, ధూళి నుంచి రక్షణ ఉంటుంది.
Leica కెమెరా సిస్టమ్..
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో Leica ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉంది.
50MP ప్రైమరీ కెమెరా (1-ఇంచ్ Light Fusion 1050L సెన్సార్, OIS)
200MP టెలిఫోటో కెమెరా (120x డిజిటల్ జూమ్)
50MP అల్ట్రావైడ్ కెమెరా (115° ఫీల్డ్ ఆఫ్ వ్యూ)
సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ (30fps)కు కూడా సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ, కనెక్టివిటీ..
Xiaomi 17 Ultraలో 6000mAh బ్యాటరీ ఉంది.
90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్
50W వైర్‌లెస్ చార్జింగ్
కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi 7, Bluetooth 6, NFC, NavIC వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు.