Jio vs Airtel: 28 రోజుల ప్లాన్‌లో ఏది బెస్ట్?

Jio vs Airtel: జియో vs ఎయిర్‌టెల్: 28 రోజుల వ్యాలిడిటీతో ఏ ప్లాన్ బెస్ట్? రూ. 349కే గూగుల్ జెమినీ ప్రో అందించే జియో ప్లాన్ లాభదాయకమా లేక అదనపు ఫీచర్లతో వచ్చే ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ మెరుగైనదా? ఈ రెండు కంపెనీల డేటా, బెనిఫిట్స్ పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-14 13:53 GMT

Jio vs Airtel: 28 రోజుల ప్లాన్‌లో ఏది బెస్ట్? 

Jio vs Airtel: టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ఆఫర్లతో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రోజుకు 2GB డేటా అవసరమయ్యే యూజర్ల కోసం రెండు కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ధర, ప్రయోజనాల విషయంలో ఏ కంపెనీ ప్లాన్ ఎక్కువగా యూజర్స్‌కు లాభమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జియో రూ.349 ప్లాన్ వివరాలు..

జియో తన వినియోగదారులకు రూ.349 ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2GB హై-స్పీడ్ డేటా (మొత్తం 56GB) వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఈ ప్లాన్ సొంతం. ఈ ప్లాన్ ద్వారా అత్యంత ఖరీదైన రూ35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీ యాక్సెస్, 50GB క్లౌడ్ స్టోరేజ్ కూడా అందుబాటులోకి వస్తుంది. రెండో నెలలో కూడా యూజర్స్ ఈ ప్రయోజనాలు పొందాలంటే గడువు ముగియడానికి రెండు రోజుల ముందే రీఛార్జ్ చేసుకోవాలి (ప్రస్తుత ప్లాన్ ముగిశాకే కొత్త ప్లాన్ అమల్లోకి వస్తుంది).

ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ వివరాలు..

ఎయిర్‌టెల్ తన రూ.398 ప్లాన్‌తో ప్రీమియం సర్వీసులను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటా, అపరిమిత 5G డేటా ఆఫర్ లభిస్తుంది. దీంతో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు వస్తాయి. అలాగే 28 రోజుల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. వీటితో పాటు రూ.4 వేల విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ కాల్ అలర్ట్స్, ఉచిత హలో ట్యూన్స్ సౌకర్యం కూడా ఉంది.

ఏది బెస్ట్ అంటే..

మీరు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు, ముఖ్యంగా గూగుల్ జెమినీ ప్రో వంటి ఏఐ సర్వీసులు కావాలనుకుంటే జియో రూ.349 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్‌టెల్ తో పోలిస్తే జియో ప్లాన్ సుమారు రూ.49 తక్కువగా ఉంది. ఒకవేళ మీకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, స్పామ్ కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ ఎంచుకోవచ్చని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News