ChatGPT: కోడి ముందా.. గుడ్డు ముందా.. అసలు మ్యాటర్ తేల్చేసిన చాట్ జీపీటీ.. ఏం చెప్పిందంటే?

Chicken Or Egg: ప్రస్తుతం ఎక్కడ చూసిన చాట్ GPT గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Update: 2023-04-24 13:30 GMT

Chat GPT: కోడి ముందా.. గుడ్డు ముందా.. అసలు మ్యాటర్ తేల్చేసిన చాట్ జీపీటీ.. ఏం చెప్పిందంటే?

Chicken Or Egg: ప్రస్తుతం ఎక్కడ చూసిన చాట్ GPT గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని ద్వారా ప్రజలు తమ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ఓ అద్భుతమైన ప్రశ్నకు సమాధానం తెలసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భూమిపైకి మొదట వచ్చిందా కోడి వచ్చిందా లేదా గుడ్డు వచ్చిందా అని చాట్ జీపీటీని ప్రశ్నించారు. చాట్ GPT ఈ ప్రశ్నకు ఫన్నీ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శాస్త్రీయ లేదా విశ్వతనీయనిచ్చే సమాధానం లేదు!

చాట్ GPTని దీని గురించి అడిగినప్పుడు, ఇదే సమాధానం చెప్పింది. కోడి లేదా గుడ్డు ఏది మొదట వచ్చిందో ఎవరికీ తెలియదని, ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రీయ లేదా వేద వాస్తవాలపై ఆధారపడి ఉండదు. ఇది శాస్త్రీయ లేదా విశ్వ సంబంధమైన సమాధానం లేని ప్రకృతి లేదా మతపరమైన ప్రశ్న లాంటిదంటూ సమాధానం ఇచ్చింది.

ఇందులో వివిధ కోణాలు..

ఇందులో రకరకాల దృక్కోణాలు ఉండవచ్చని చెప్పుకొచ్చింది. కొంతమంది మొదట గుడ్డు వచ్చి ఉంటుందని, ఆ తర్వాత కోడి పుట్టిందని చెబుతుంటారు. మరికొందరు మొదట కోడి వచ్చి గుడ్లు పెట్టడం ప్రారంభించిందని నమ్ముతున్నారు. మరొక అభిప్రాయం ఏమిటంటే, గుడ్డు, కోడి రెండూ ఒకే సమయంలో సృష్టి కోసం ప్రకృతిచే సృష్టించబడ్డాయని చెబుతుంటారు. మరోవైపు, శాస్త్రీయ దృక్కోణం నుంచి చూస్తే, గుడ్డు, కోడి రెండూ ఒక రకమైన జీవి. వాటి ఉత్పత్తి ప్రక్రియ కలిసి అభివృద్ధి చెంది ఉండవచ్చని అంటుంటారు.

ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు..

అయితే కోడి గుడ్డు పెడుతుందని సాధారణంగా మనకు తెలిసిందే. అది తరువాత కోడిపిల్లను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఇది విభిన్న దృక్కోణాలు, ఊహలపై ఆధారపడి ఉంటుంది. మీరు దానిని హాస్యాస్పదంగా లేదా లోతుగా చర్చించవచ్చు. కానీ, శాస్త్రీయ లేదా సాంకేతిక మార్గంలో స్పష్టమైన సమాధానం ఎప్పుడూ దొరకదని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News