Flipkart Month End Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఈ మూడు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్..!

Flipkart Month End Sale: గత కొన్ని రోజులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ లైవ్ అవుతోంది.

Update: 2025-01-27 09:48 GMT

Flipkart Month End Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఈ మూడు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్..!

Flipkart Month End Sale: గత కొన్ని రోజులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ లైవ్ అవుతోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లపై చాలా అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. ఈ సేల్ జనవరి 26 రాత్రి ముగిసింది. అయితే ఇప్పుడు ఈ ఇ కామర్స్ సైట్‌ మరో కొత్త సేల్‌ను ప్రకటించింది. మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమైంది. ఈ సేల్ జనవరి 27 నుండి జనవరి 31 వరకు లైవ్‌లో ఉంటుంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒప్పో K12x 5G

స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 16,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 12,999కే మీ సొంతం చేసుకోవచ్చు. బాబ్‌కార్డ్ ఈఎమ్ఐతో ఫోన్‌పై రూ. 1500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, బై మోర్, సేవ్ మోర్ అనే ఆఫర్‌తో ఫోన్‌పై రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

మోటోరోలా G45 5G

ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కూడా చాలా చౌక ధరలో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 12,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు రూ.9,999కే ఆర్డర్ చేసుకోవచ్చు. నో కాస్ట్ EMI ఎంపికతో మీరు నెలకు రూ. 1,667 చెల్లించి కూడా సొంతం చేసుకోవచ్చు.

నథింగ్ పోన్ CMF 1

CMF బై నథింగ్ ఫోన్ 1 కూడా ఈ సేల్‌లో చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 21,999 కే మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 16,999కే మీ సొంతం చేసుకోవచ్చు. బాబ్ కార్డ్ ఈఎమ్ఐతో మీకు ఫోన్‌పై రూ. 1500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Tags:    

Similar News