Cheapest 5G Phone: చీపెస్ట్ 5జీ ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు

Flipkart has announced a huge offer on the Vivo T3X 5G smartphone
x

 చీపెస్ట్ 5జీ ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు

Highlights

గత కొన్ని రోజులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది, ఇందులో అనేక స్మార్ట్‌ఫోన్ల ధరలపై తగ్గింపులు కనిపిస్తున్నాయి.

Cheapest 5G Phone: గత కొన్ని రోజులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది, ఇందులో అనేక స్మార్ట్‌ఫోన్ల ధరలపై తగ్గింపులు కనిపిస్తున్నాయి. ఈ సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు సగం ధరకే లభిస్తున్నాయి. మీరు తక్కువ ధరతో పాటు పెద్ద బ్యాటరీని అందించే ఫోన్ కోసం చూస్తున్నట్లయితే వివో T3x 5Gని ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అతి తక్కువ ధరకు గొప్ప ఫీచర్లను అందిస్తున్న ఫోన్‌. ఈ స్మార్ట్‌ఫోన్ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Vivo T3x 5G Offers

వివో ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 12,499 మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను కేవలం రూ.17,499కే పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై 28శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఆన్ లైన్ లో ఈ ఫోన్ ధర కేవలం రూ. 11,499 కు అందిస్తారు. ఈ ఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది. దీంతో మీరు పాత ఫోన్‌పై రూ. 3000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే మీరు ఇదే ధరలో TECNO POVA Neo 5G లేదా iQOO Z9xని కూడా కొనచ్చు.

Vivo T3x 5G Features

Vivo T3x 5Gని కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 2024లో లాంచ్ చేసింది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 6.72-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో 4GB, 6GB, 8GB RAM ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. పెద్ద 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలానే ఫోన్‌లో 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

కెమెరా గురించి మాట్లాడితే Vivo T3x 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీ కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. మొత్తంమీద ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ధరలో గొప్ప ఫీచర్లను అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories