Mobile Tips and Tricks​: బ్లూటూత్‌, వైఫై ఆఫ్ చేస్తే బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుందా ?

Mobile Tips and Tricks: ఐఫోన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. వీటిని ప్రజలు గుడ్డిగా నమ్ముతారు.

Update: 2025-01-30 08:38 GMT

Mobile Tips and Tricks​: బ్లూటూత్‌, వైఫై ఆఫ్ చేస్తే బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుందా ?

Mobile Tips and Tricks: ఐఫోన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. వీటిని ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఈ అపోహలలో చాలా వరకు టెక్నాలజీ వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ వీడియోల ద్వారా మరింత బలపడుతున్నాయి. ఈ అపోహలు నిజం కాదని ఆపిల్ సంస్థ తేల్చేసింది. ఐఫోన్‌కు సంబంధించిన 5 అత్యంత సాధారణ అపోహల గురించి నిజాలు తెలుసుందాం.

చాలా మంది తమ ఐఫోన్‌లో Wi-Fi, బ్లూటూత్‌ను ఆఫ్ చేస్తే, బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుందని భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఈ ఫీచర్లు ఆన్‌లో ఉండి ఉపయోగంలో లేనప్పుడు అవి ఎక్కువ బ్యాటరీని వినియోగించుకోవు. అందుకు బదులు మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేయాలని అనుకుంటే.. ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం మంచి పని.

తడి ఐఫోన్‌ను బియ్యంలో వేస్తే అది ఎండిపోతుందా?

ఐఫోన్ నీటిలో పడితే బియ్యంలో పెడితే త్వరగా ఆరిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఈ పద్ధతి చాలా హానికరం అని ఆపిల్ తెలిపింది. చిన్న బియ్యం కణాలు ఐఫోన్ లోపలికి వెళ్లి మరింత నష్టాన్ని కలిగిస్తాయి.దీనికి బదులుగా ఆపిల్ ఫోన్‌ను పొడి, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచితే దానంతట అదే ఆరిపోతుందని కంపెనీ తెలిపింది.

ప్రైవేట్ బ్రౌజింగ్ ఐపీ అడ్రస్ హైడ్ చేస్తుందా?

చాలా మంది తమ ఐఫోన్‌లో ప్రైవేట్ బ్రౌజింగ్ (ఇన్‌కాగ్నిటో మోడ్) ఆన్ చేస్తే, వారి లొకేషన్, ఐపీ అడ్రస్ హైడ్ అయిపోతాయని నమ్ముతారు. కానీ, అది పూర్తిగా సరైనది కాదు. ప్రైవేట్ మోడ్ మీ బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేయకుండా మాత్రమే నిరోధిస్తుంది, కానీ వెబ్‌సైట్‌లు మాత్రం మీ సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాయి. మీ ఐపీ అడ్రస్, స్టేటస్ దాచాలనుకుంటే Apple iCloud+ ప్రైవేట్ రిలే ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

యాప్‌లను మూసివేయడం వల్ల బ్యాటరీ ఆదా అవుతుందా?

తరచుగా ప్రజలు తమ ఐఫోన్‌లో ఓపెన్ ఉన్న యాప్‌లను పదే పదే క్లోజ్ చేస్తుంటారు. ఇది బ్యాటరీని ఆదా చేస్తుందని భావిస్తారు. కానీ ఇది కూడా నిజానికి తప్పే. నిజానికి, మీరు ఒక యాప్‌ను క్లోజ్ చేసి, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది బ్యాటరీపై ఎక్కువ భారాన్ని మోపుతుంది. ఐఫోన్‌లో ఓపెన్ చేసిన యాప్‌లు ఫ్రోజెన్ స్టేట్ లో ఉంటాయి.. అవి ఎక్కువ బ్యాటరీని వినియోగించవు.

రాత్రిపూట ఛార్జింగ్ చేయడం వల్ల మీ ఐఫోన్ బ్యాటరీ దెబ్బతింటుందా?

మీరు మీ ఐఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచితే అది బ్యాటరీని దెబ్బతీస్తుందనేది ఒక అపోహ.. కానీ వాస్తవం ఏమిటంటే ఐఫోన్ బ్యాటరీ 100% ఛార్జ్ అయినప్పుడు, అది అదనపు ఛార్జ్ తీసుకోవడం ఆపివేస్తుంది. ఆపిల్ ప్రకారం, బ్యాటరీలు కాలక్రమేణా సామర్థ్యాన్ని కోల్పోతాయి, కానీ మీరు వాటిని ఎంతగా ఛార్జ్ చేస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉండదు.

Tags:    

Similar News