iPhone 16 Pro Max Discounts: వావ్ వండర్‌ఫుల్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై రూ. 21,200 డిస్కౌంట్..!

iPhone 16 Pro Max Discounts: మీరు మీ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో శుభవార్త.

Vamsi Krishna
Published on: 11 March 2025 11:19 AM IST
iPhone 16 Pro Max Discounts
X

iPhone 16 Pro Max Discounts: వావ్ వండర్‌ఫుల్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై రూ. 21,200 డిస్కౌంట్..!

iPhone 16 Pro Max Discounts: మీరు మీ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ 'iPhone 16 Pro Max' ధరను భారీగా తగ్గించింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై రూ.21 వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ తగ్గింపు లభిస్తుంది. అలానే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్‌తో యాపిల్ అభిమానులు ఈ సిరీస్‌లోని అత్యంత ఖరీదైన మోడల్‌‌పై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.

iPhone 16 Pro Max Offers

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్‌ని దేశంలో రూ. 1,44,900కి విడుదల చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రూ. 11,200 తగ్గింపుతో లభిస్తుంది, దీని ధర రూ. 1,33,700. అదనంగా మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా KOTAK బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. అయితే HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ. 4,500 డిస్కౌంట్ ఇస్తున్నారు. IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 10,000 ప్రత్యక్ష తగ్గింపు దక్కించుకోవచ్చు. దీని కారణంగా మీరు ఫోన్‌లో రూ. 21,200 వరకు ఆదా చేసుకోవచ్చు.

iPhone 16 Pro Max Specifications

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను 2,000 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఈ ఫోన్‌లో టైటానియం డిజైన్ మరియు అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ప్రీమియం ఫోన్ 3nm A18 ప్రో చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంది మరియు Zenmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్ విత్ సిరి, GPT సపోర్ట్ మరియు అన్ని Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది.

iPhone 16 Pro Max Camera

ఫోటోగ్రఫీ కోసం ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే మీరు ముందు కెమెరాతో కూడా 4Kలో వీడియోను రికార్డ్ చేయచ్చు.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story