Yuvraj Singh: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా మెంటర్‌గా యువరాజ్ సింగ్!

Yuvraj Singh: 2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు మెంటర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2026-01-28 13:16 GMT

Yuvraj Singh: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా మెంటర్‌గా యువరాజ్ సింగ్!

Yuvraj Singh: భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు మెంటర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా టోర్నీకి ముందు టీమ్‌కు అనుభవజ్ఞుడైన మాజీ ఆటగాడి మార్గనిర్దేశం ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. గతంలో టీమిండియాకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

యువరాజ్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌లు టీమిండియా గెలవడంలో యువీ పాత్ర కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడిగా యువీకి పేరుంది. అలాంటి ఆటగాడు మెంటర్‌గా ఉంటే.. యువ క్రికెటర్లకు మానసికంగా, సాంకేతికంగా ఎంతో బలం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం, టీ20 ఫార్మాట్‌లో నిరంతర మార్పులు చోటుచేసుకోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మెంటర్ పాత్ర మరింత కీలకంగా మారింది. మ్యాచ్ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అనే విషయాల్లో యువరాజ్ అనుభవం ఆటగాళ్లకు దోహదపడనుందని భావిస్తున్నారు.

ఒకవేళ మెంటర్‌గా యువరాజ్ సింగ్ నియామకం ఖరారైతే.. టీ20 వరల్డ్‌కప్‌ 2026లో టీమిండియా కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. యువీ మెంటర్‌గా ఉంటే.. భారత జట్టు మరోసారి ప్రపంచకప్ కలను సాకారం చేసుకుంటుందని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ ఆరంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా గ్రూప్‌-ఎలో ఉంది. ఈ గ్రూపూలో పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ టీమ్స్ ఉన్నాయి. నమీబియాతో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఫేవరేట్ జట్లుగా ఉన్నాయి.

Tags:    

Similar News