IML 2025: యువరాజ్‌తో వెస్టిండీస్‌ ప్లేయర్‌ గొడవ.. మరోసారి యువీ విశ్వరూపం.. వైరల్‌ వీడియో!

Update: 2025-03-17 03:12 GMT

IML 2025: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 ఫైనల్లో ఇండియా మాస్టర్స్ వెస్టిండీస్ మాస్టర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇండియా మాస్టర్స్ తరఫున బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు.

సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ఇండియా మాస్టర్స్ జట్టు బ్రియాన్ లారా నాయకత్వంలోని వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. తొలిసారిగా అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ నిర్వహించింది. మొదటి ప్రయత్నంలోనే ఇండియా మాస్టర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ తరఫున అంబటి రాయుడు, సచిన్ టెండూల్కర్, వినయ్ కుమార్ అద్భుతంగా రాణించారు. ఈ ఆటగాళ్ళు జట్టుకు టైటిల్ తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. కానీ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ వెస్టిండీస్ మాస్టర్స్ టినో వెస్ట్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు . ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ 148 పరుగులు చేసింది. దీని తరువాత, లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, ఇండియా మాస్టర్స్ జట్టు మంచి దూకుడుమీదుంది. 13వ ఓవర్లో, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ వారి తరపున బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పుడే యువరాజ్ కి టినో వెస్ట్ తో వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరిపై ఒకరు ఏదో అరుస్తున్నారు. మధ్యలో, రాయుడు కూడా యువరాజ్‌ను తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ టినో వెస్ట్ వినలేదు. కోపంతో తన చేతితో యువీకి ఏదో చెప్పమని సంజ్ఞ చేశాడు. ఇంతలో అంపైర్, ఇతర ఆటగాళ్ళు జోక్యం చేసుకున్నారు. వీడియో చూస్తుంటే ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకున్నట్లు అనిపిస్తోంది. అనంతరం వారిద్దరికి సర్థిచెప్పి పక్కకు తీసుకెళ్లారు ఇతర ఆటగాళ్లు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Tags:    

Similar News