Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలనం...సచిన్ రికార్డు బద్దలు
Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలనం...సచిన్ రికార్డు బద్దలు
Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 302 పరుగులు సాధించినందుకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో విరాట్ కోహ్లీ పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
కోహ్లీకి ఇది అంతర్జాతీయ కెరీర్‌లో 20వ సారి ఈ అవార్డు దక్కడం విశేషం. ఈ ఘనతతో ఆయన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (19 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రపంచంలో అత్యధిక సార్లు ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లలో షకీబ్ అల్ హసన్ (17), జాక్వెస్ కల్లిస్ (14), సనత్ జయసూర్య, డేవిడ్ వార్నర్ (చెరో 13) వంటి దిగ్గజాలు ఉన్నారు.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ నిలకడైన ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆయన ఈ మూడు వన్డేల్లో వరుసగా 135, 102, 65 పరుగులు* సాధించారు. అంటే, ఈ సిరీస్‌లో ఆయన రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అంతేకాదు, కోహ్లీ తన కెరీర్‌లో వరుసగా నాలుగు అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించడం ఇది తొమ్మిదోసారి కావడం అతని నిలకడకు నిదర్శనం.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 28,000 పరుగుల మైలురాయికి కేవలం 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, 2025లో భారత జట్టుకు ఇక వన్డే మ్యాచ్‌లు లేకపోవడంతో, కోహ్లీ ఈ మైలురాయిని చేరుకోవడానికి వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి ఉంటుంది.