T20 World Cup 2026: టీమిండియా ఓపెనింగ్ జోడీ ఫిక్స్! అభిషేక్ శర్మతో కలిసి గంభీర్ పంపుతున్న 'తుఫాన్' ప్లేయర్ ఇతడే!
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత్ ఓపెనింగ్ జోడీ ఖరారైంది. అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. గంభీర్ వ్యూహంతో ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గరపడుతున్న వేళ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అమ్ములపొదిలోని అసలైన అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించగా.. ఇప్పుడు అందరి దృష్టి ఓపెనింగ్ జోడీపైనే ఉంది. గంభీర్ తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో ఇద్దరు డాషింగ్ ఓపెనర్లను బరిలోకి దించేందుకు స్కెచ్ వేశారు. యువ సంచలనం అభిషేక్ శర్మకు జోడీగా, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
నిర్భయమైన 'లెఫ్ట్-హ్యాండ్' కాంబినేషన్!
గౌతమ్ గంభీర్ కోరుకున్నట్లుగానే టాప్ ఆర్డర్‌లో ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ కానుంది.
అభిషేక్ శర్మ: స్పిన్, పేస్ అనే తేడా లేకుండా పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించగలడు.
ఇషాన్ కిషన్: కిషన్ తిరిగి జట్టులోకి రావడంతో ఓపెనింగ్‌లో దూకుడుతో పాటు వికెట్ కీపింగ్ రూపంలో జట్టుకు అదనపు బలం లభిస్తుంది. ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు పీడకల మిగిల్చడం ఖాయం.
రెండేళ్ల నిరీక్షణకు తెర.. ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఇషాన్ కిషన్ జాతీయ జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 2023 నవంబర్‌లో చివరిసారిగా టీ20 ఆడిన కిషన్, ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు, ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యారు. అయితే, దేశీయ క్రికెట్‌లో పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు.
కిషన్ ఫామ్ చూస్తే బౌలర్లకు వణకే!
సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.
పరుగులు: 10 మ్యాచ్‌ల్లో 517 పరుగులు.
సగటు: 57.44
స్ట్రైక్ రేట్: ఏకంగా 197.33 (టీ20ల్లో ఇది అద్భుతమైన గణాంకం).
సెంచరీలు: రెండు సెంచరీలు (అత్యధిక స్కోరు 113).
ఈ విధ్వంసకర ఫామ్‌ను చూశాక, గంభీర్ అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేయడంలో సందేహం లేకుండా పోయింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌లో ఈ జోడీ భారత్‌కు శుభారంభాలను అందిస్తుందని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది.