Smriti–Palash: మళ్లీ ఆస్పత్రిలో స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్…
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన పెళ్లి మరోసారి అనిశ్చితిలో పడింది. వరుడు పలాశ్ ముచ్చల్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో మంగళవారం ముంబయిలోని ఎస్‌వీఆర్ ఆసుపత్రిలో చేరారు.

కొద్ది రోజుల క్రితం వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ సమస్యలతో పలాశ్ ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. కానీ శరీరంపై ఒత్తిడి పెరగడం, వరుస ప్రయాణాలు, ఫోటోషూట్లు, సంగీత్ కార్యక్రమాల్లో నృత్యాలు, తగిన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో మరోసారి అస్వస్థతకు గురైనట్లు అతడి టీమ్ వెల్లడించింది.
స్మృతి తండ్రి అనారోగ్యం కూడా పలాశ్‌పై భారీగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. స్మృతి తండ్రితో పలాశ్‌కు మంచి అనుబంధం ఉండేది. ఆదివారం ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తను తట్టుకోలేక పలాశ్ సుమారు నాలుగు గంటల పాటు నిరంతరం ఏడ్చాడని, ఆ భావోద్వేగ ఒత్తిడే ఆరోగ్యం క్షీణించడానికి కారణమని అతని తల్లి పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
వివాహం వాయిదా – కుటుంబ సభ్యుల నిర్ణయం
నవంబర్ 23న బెంగళూరులో జరగాల్సిన స్మృతి–పలాశ్ వివాహం, స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించినట్లు ఆమె మేనేజర్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా పలాశ్ కూడా వరుసగా రెండోసారి అనారోగ్యానికి గురవడంతో, వివాహ వేడుకలపై మరింత అనిశ్చితి నెలకొంది.