Smriti Mandhana : స్మృతి -పలాష్ వివాహం రద్దు..మోసపూరిత ఆరోపణల కారణంగా విడిపోయిన జంట

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ బ్యాటర్‌ అయిన స్మృతి మంధాన మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌తో తన వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు సుమారు రెండు వారాల నిశ్శబ్దం తర్వాత డిసెంబర్ 7న ప్రకటించింది.

Update: 2025-12-08 05:09 GMT

Smriti Mandhana : స్మృతి -పలాష్ వివాహం రద్దు..మోసపూరిత ఆరోపణల కారణంగా విడిపోయిన జంట

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ బ్యాటర్‌ అయిన స్మృతి మంధాన మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌తో తన వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు సుమారు రెండు వారాల నిశ్శబ్దం తర్వాత డిసెంబర్ 7న ప్రకటించింది. ఈ సూపర్‌హిట్ కపుల్ పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉండగా, అదే రోజు ఉన్నట్టుండి వాయిదా పడింది. మొదట్లో స్మృతి తండ్రికి అనారోగ్యం కారణంగా పెళ్లి ఆగిందని చెప్పినా, ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు, ఆరోపణల కారణంగా ఈ జంట విడిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ప్రేమను బహిరంగంగా ప్రకటించుకుని, అభిమానుల ప్రేమను పొందిన ఈ జంట, ఇంతటి క్లిష్ట పరిస్థితికి చేరుకోవడానికి కారణాలను పరిశీలిద్దాం.

నవంబర్ 2న భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో వివాహం జరగబోతుందని వార్తలు వచ్చాయి. నవంబర్ 21న పలాష్, స్మృతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ పెడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. అయితే నవంబర్ 23 మధ్యాహ్నం 4 గంటలకు, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు గుండెనొప్పి వచ్చిందని, అందుకే పెళ్లి వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత కథ పూర్తిగా మారిపోయింది.

నవంబర్ 25న ఒక మహిళ పలాష్, ఆమె మధ్య జరిగిన ఫ్లర్టింగ్ ఛాటింగ్ స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. దీనితో పెళ్లికి ఒక్కరోజు ముందు పలాష్ మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. కొన్ని అజ్ఞాత రెడిట్ పోస్టుల ద్వారా, నవంబర్ 22న ఒక భారత క్రికెటర్ పలాష్‌ను ఒక కొరియోగ్రాఫర్‌తో అభ్యంతరకరమైన స్థితిలో చూసి, ఆ విషయాన్ని స్మృతికి తెలియజేయడంతోనే పరిస్థితి చేయి దాటిపోయిందని, అందుకే స్మృతి తండ్రికి అనారోగ్యం వచ్చిందని కథనాలు వచ్చాయి. మొదట్లో పలాష్ తల్లి, సోదరి పలక్ ముచ్ఛల్ ఈ ఆరోపణలను ఖండించారు. స్మృతి తండ్రి ఆరోగ్యం వల్లే పెళ్లి ఆగిందని, పలాష్‌కు అనారోగ్యం వచ్చిందని వారు పేర్కొన్నారు.

పద్నాలుగు రోజుల నిశ్శబ్దం తర్వాత, డిసెంబర్ 7న స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తన జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకుంటున్నానని, ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని ప్రజలను అభ్యర్థించింది. ఈ ప్రకటన చేసిన వెంటనే స్మృతి, పలాష్, అతని సోదరి పలక్ లను ఇన్‌స్టాగ్రామ్ నుంచి అన్‌ఫాలో చేసింది. దీనికి ప్రతిస్పందనగా, పలాష్ కూడా తమ వ్యక్తిగత సంబంధం నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఏదేమైనా ఒకప్పుడు హాట్‌కపుల్‌గా ఉన్న ఈ జంట కథ విషాదంగా ముగిసింది.

Tags:    

Similar News