Shubman Gill : శుభ్‌మన్ గిల్ హెల్త్ అప్‌డేట్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. రెండో టెస్ట్ ఆడటంపై సందిగ్ధత

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో మెడ నొప్పితో గాయపడిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గుడ్ న్యూస్.

Update: 2025-11-17 06:44 GMT

Shubman Gill : శుభ్‌మన్ గిల్ హెల్త్ అప్‌డేట్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. రెండో టెస్ట్ ఆడటంపై సందిగ్ధత

Shubman Gill : సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో మెడ నొప్పితో గాయపడిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గుడ్ న్యూస్. అతనిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గిల్ మెడకు తీవ్రంగా నొప్పి రావడంతో మైదానం నుంచి బయటకు వెళ్లి, ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లాడు. ఆదివారం నాడు గిల్‌ను పరామర్శించడానికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. తాజాగా గిల్ కోల్‌కతాలోని టీమ్ హోటల్‌కు తిరిగి వచ్చారు.

ఇండియా టుడే నివేదిక ప్రకారం, గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మెడ కదలికలు మెరుగుపడ్డాయి. నొప్పి కూడా తగ్గింది. అతను సరిగ్గా నడవగలుగుతున్నాడు. మెడను కదిలించడంలో ఇబ్బంది లేదు. ప్రస్తుతం గిల్ హోటల్‌లో టీమ్ మెడికల్ సిబ్బంది పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెడకు పట్టీతో కనిపించిన గిల్, త్వరగా కోలుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రెండో టెస్ట్‌లో ఆడతాడా?

రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనుంది. అయితే, శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తదుపరి రోజుల్లో అతని రికవరీ ఎంత వేగంగా జరుగుతుంది అనే దానిపైనే అతని భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది.

మెడ నొప్పి కారణంగా గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోవడం భారత జట్టు ఓటమికి ఒక కారణంగా నిలిచింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా 93 పరుగులకే ఆలౌట్ అయి 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. త్వరలో గిల్ ఫిట్‌నెస్ గురించి పూర్తి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News