Rohit Sharma: న్యూ రోల్ అంటూ రోహిత్ శర్మ పోస్ట్.. మళ్లీ వన్డే కెప్టెన్సీనా?

Rohit Sharma: రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన “న్యూ రోల్ లోడింగ్” పోస్ట్ వైరల్‌గా మారింది. మళ్లీ వన్డే కెప్టెన్సీ ఇస్తున్నారా అనే చర్చ మొదలైంది.

Update: 2026-01-29 10:51 GMT

Rohit Sharma: న్యూ రోల్ అంటూ రోహిత్ శర్మ పోస్ట్.. మళ్లీ వన్డే కెప్టెన్సీనా?

Rohit Sharma: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టెస్టులు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యారు. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “న్యూ రోల్ లోడింగ్.. లీడ్ ఇండియా.. రేపు మధ్యాహ్నం వరకు ఆగండి” అంటూ స్టేటస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

ఈ స్టేటస్ చూసిన అభిమానులు రోహిత్ శర్మకు మళ్లీ వన్డే కెప్టెన్సీ అప్పగించబోతున్నారని అభిప్రాయపడుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ కెప్టెన్‌గా కొనసాగితేనే భారత్‌కు మరోసారి ట్రోఫీ వస్తుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఇది క్రికెట్‌కు సంబంధించినది కాకుండా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ లేదా వ్యక్తిగత ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే రోహిత్ శర్మ ప్రకటించినట్లే రేపు మధ్యాహ్నం వరకు వేచిచూడాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News