6 Sixes in an Over : యువరాజ్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా?

6 Sixes in an Over: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం అనేది ఒక అరుదైన ఫీట్. 1877లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైనప్పటికీ 2007లో మాత్రమే ఈ ఘనతను ఓ బ్యాట్స్‌మన్ తొలిసారి నమోదు చేయగలిగాడు.

Update: 2025-10-25 06:00 GMT

6 Sixes in an Over : యువరాజ్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా?

6 Sixes in an Over: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం అనేది ఒక అరుదైన ఫీట్. 1877లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైనప్పటికీ 2007లో మాత్రమే ఈ ఘనతను ఓ బ్యాట్స్‌మన్ తొలిసారి నమోదు చేయగలిగాడు. భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ 2007లో ఈ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన మొదటి ఆటగాడు యువరాజ్ సింగ్ కాదని చాలామందికి తెలియదు. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన మొదటి ఆటగాడు దక్షిణాఫ్రికాకు చెందిన హర్షెల్ గిబ్స్. 2007లో నెదర్లాండ్స్‌పై జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగే బౌలింగ్‌లో గిబ్స్ ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. దేశీయ క్రికెట్‌లో గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడవ ఆటగాడు గిబ్స్ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడు ఇతనే.

యువరాజ్ సింగ్ (భారత్)

భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడు. 2007లోనే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఈ రికార్డు నెలకొల్పాడు. అతను ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు, ఇది ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఉంది.

కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీ20 ఫార్మాట్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన రెండవ ఆటగాడు. పొలార్డ్ 2021లో శ్రీలంకపై జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అతను స్పిన్ బౌలర్ అఖిల ధనంజయ బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆశ్చర్యకరంగా, ఆరు సిక్స్‌లు కొట్టడానికి ఒక ఓవర్ ముందు, అఖిల ధనంజయ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

జస్కరన్ మల్హోత్రా (అమెరికా)

అమెరికాకు చెందిన జస్కరన్ మల్హోత్రా వన్డే ఇంటర్నేషనల్‌లో ఈ రికార్డు సాధించిన రెండవ ఆటగాడు. 2021లోనే పాపువా న్యూ గినియాపై జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో జస్కరన్ మల్హోత్రా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అతను గౌడి టోకా బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.

దీపేంద్ర సింగ్ ఐరీ (నేపాల్)

నేపాల్ బ్యాట్స్‌మన్ దీపేంద్ర సింగ్ ఐరీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడవ, మొత్తంగా ఐదవ ఆటగాడు. 2024లో ఖతార్‌పై జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో దీపేంద్ర ఈ రికార్డును నెలకొల్పాడు. అతను ఫాస్ట్ బౌలర్ కామ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.

Tags:    

Similar News