IND vs SA 2nd Test:గౌహతి టెస్ట్‌కు గిల్ ఔట్.. టీమిండియా కెప్టెన్ లేకుండానే సిరీస్ సేవ్ చేయగలదా ?

భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోల్‌కతా టెస్ట్ ఓటమి తర్వాత 0-1తో వెనుకబడిన టీమ్ ఇండియాకు ఇప్పుడు గౌహతి టెస్ట్‌లో సిరీస్ రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Update: 2025-11-21 05:02 GMT

IND vs SA 2nd Test:గౌహతి టెస్ట్‌కు గిల్ ఔట్.. టీమిండియా కెప్టెన్ లేకుండానే సిరీస్ సేవ్ చేయగలదా ?

IND vs SA 2nd Test: భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోల్‌కతా టెస్ట్ ఓటమి తర్వాత 0-1తో వెనుకబడిన టీమ్ ఇండియాకు ఇప్పుడు గౌహతి టెస్ట్‌లో సిరీస్ రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కీలకమైన రెండో మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం లేదని దాదాపు స్పష్టమైంది. కోల్‌కతా టెస్ట్‌లో గిల్ మెడకు గాయం కారణంగా గురువారం (నవంబర్ 20) జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన పాల్గొనలేదు. దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనుండగా, గిల్ లేని లోటును పూడ్చడానికి, జట్టులో బ్యాలెన్స్ కోసం కోచ్ గంభీర్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

గిల్ స్థానంలో సుదర్శన్, అక్షర్‌పై వేటు?

గిల్ గైర్హాజరీలో జట్టులోకి ఎవరు వస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కోల్‌కతా టెస్ట్ నుంచి పాఠాలు నేర్చుకుని, బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేసే దిశగా జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.గిల్ స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కవచ్చు. కోల్‌కతాలో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి కేవలం ముగ్గురు స్పిన్నర్లతో మాత్రమే వెళ్లాలని జట్టు భావిస్తోంది. ఈ వ్యూహం అమలు చేయాలంటే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది.

బ్యాటింగ్ బలోపేతంపై దృష్టి

అక్షర్ పటేల్‌ను తప్పిస్తే అతని స్థానంలో యువ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి రావడం వల్ల జట్టులో రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే అదనపు బ్యాటర్ వస్తాడు. ఇది టీమిండియా బ్యాటింగ్ డెప్త్‌కు ఉపయోగపడుతుంది. జట్టులో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అందుకే గత టెస్ట్‌లో అతన్ని నంబర్ 3 స్థానంలో ఆడించారు. కాబట్టి సుందర్‌ను తప్పించే ప్రసక్తే లేదు.

రవీంద్ర జడేజాను తీసేయడం అసాధ్యం, కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం జట్టులో అత్యుత్తమ స్పిన్నర్‌గా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ముందుకు వెళ్లాలంటే టీమ్‌ను వీడే ఏకైక ఆటగాడు అక్షర్ పటేల్ అయ్యే అవకాశం ఉంది. కోచ్ గంభీర్‌కు ఇది చాలా కఠినమైన నిర్ణయమే అయినా సిరీస్ సేవ్ చేయడానికి తప్పనిసరి కావచ్చు.

Tags:    

Similar News