ENG vs IND 4th Test: సాయి సుదర్శన్ మళ్లీ జట్టులోకి వస్తాడా? కరుణ్ నాయర్ ఆట కొనసాగుతుందా? నాయా ట్విస్టు ఇదే!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ జట్టులో సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కుతుందా? కరుణ్ నాయర్‌ను కొనసాగిస్తారా? శుభ్‌మన్ గిల్ సంకేతాలు, మిడిల్ ఆర్డర్ మార్పులు, పేసర్ల ఫిట్‌నెస్ ఇబ్బందులు.. పూర్తి వివరాలు చదవండి.

Update: 2025-07-23 09:59 GMT

ENG vs IND 4th Test: Will Sai Sudharsan Return? Karun Nair to Continue? Here's the Twist!

ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. తొలి టెస్టులో విఫలమైన అతను తర్వాత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరోవైపు కరుణ్ నాయర్ రెండు టెస్టుల్లో అవకాశం అందుకున్నప్పటికీ బిగ్ స్కోర్లు చేయడంలో విఫలమయ్యాడు. అయినా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతనికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.

ఎవరికి ఛాన్స్‌? ఎవరికి ఔట్‌..?

ప్రస్తుతం ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నారు. వీరిలో మార్పు ఉండే అవకాశం లేదు. అయితే మూడో స్థానంపై స్పష్టత లేదు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ రెండూ ఇదే పొజిషన్‌లో ఆడారు కానీ మెప్పించలేకపోయారు.

  1. యశస్వి ఔటైతే లెఫ్ట్ హ్యాండర్‌గా సాయి సుదర్శన్‌ను పంపవచ్చు
  2. కేఎల్ ఔటైతే కరుణ్ నాయర్‌ను ప్రాధాన్యం ఇవ్వొచ్చు
  3. మిడిలార్డర్‌లో సీనియర్‌గా కరుణ్ ఆడాలంటే ఆరో స్థానంలో బరిలో దిగొచ్చు

నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా తప్పుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వాషింగ్టన్ సుందర్ పక్కన పడే ఛాన్స్ ఉంటుంది.

గిల్ నాలుగో స్థానంలో, పంత్ ఐదులో, జడేజా ఏడవ స్థానంలో ఉంటారు.

పేసర్లను కాపాడండి: మంజ్రేకర్ వ్యాఖ్యలు

పేసర్ల గాయాలతో తలబడుతున్న భారత జట్టు కోసం మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు.

‘‘ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్, నితీశ్ గాయాలపాలయ్యారు. కానీ అన్షుల్ కాంబోజ్, హర్షిత్ రాణా వంటి బలమైన యువ టాలెంట్ జట్టులో ఉన్నారు. అయితే వీరి ఫిట్‌నెస్ కాపాడటం అత్యవసరం. వరుసగా టెస్టులు, ఐపీఎల్, లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఆడడం వల్ల బౌలర్లకు గాయాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీనికి నిర్మాణాత్మక పరిష్కారం కావాలి’’ అని అన్నారు.

Tags:    

Similar News