Dhruv Jurel: ఇంగ్లండ్‌లో ధ్రువ్ జురేల్ 'హ్యాట్రిక్'.. టెస్ట్ సిరీస్‌కు ముందే రికార్డు
Dhruv Jurel: ఇంగ్లండ్ గడ్డపై ఇండియా-ఏ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురేల్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ 2025 లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత, అతను ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా పరుగుల వరద పారిస్తున్నాడు.
Dhruv Jurel: ఇంగ్లండ్ గడ్డపై ఇండియా-ఏ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురేల్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ 2025 లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత, అతను ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతను అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అంతకుముందు, మొదటి టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్థ సెంచరీలను నమోదు చేశాడు. ఈ విధంగా అతను ఇంగ్లండ్ గడ్డపై అర్థ సెంచరీల హ్యాట్రిక్ నమోదు చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 6 పరుగులతో సెంచరీని కోల్పోయినప్పటికీ, అతను ఆడుతున్న తీరు ఇంగ్లీష్ బౌలర్లకు దడ పుట్టిస్తోంది.
ధ్రువ్ జురేల్ ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 87 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ (116 పరుగులు) తో కలిసి మూడో వికెట్‌కు 121 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు, జురేల్ ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 120 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 94 పరుగులు చేశాడు. కేవలం 6 పరుగుల తేడాతో తన సెంచరీని కోల్పోయాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 53 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 53 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ తో జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాలో రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ధ్రువ్ జురేల్ ఎంపికయ్యాడు. అతను ప్రస్తుతం పరుగుల వరద పారిస్తున్న తీరు, ప్లేయింగ్ ఎలెవన్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఒకవేళ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభిస్తే, అతను దానిని సద్వినియోగం చేసుకోగలడు. ఎందుకంటే అతను ఇంగ్లండ్ పరిస్థితులకు చాలా వరకు అలవాటు పడ్డాడు. ఇది అతని ప్రదర్శనకు దోహదపడుతుంది.
ధ్రువ్ జురేల్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించినప్పటికీ జురేల్ జట్టు తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతను 14 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్‌లలో 37.00 సగటుతో 333 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు అతను అదే ఫామ్‌ను ఇంగ్లండ్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. ఇది అతని భవిష్యత్తుకు శుభసూచకం.