Dhoni: ధోని వల్ల నా బతుకు బుగ్గిపాలైంది.. బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్!
Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని వారుండరు. తను ఎంత సక్సెస్ ఫుల్ కెప్టెనో అందరికీ తెలిసిందే.
Dhoni: ధోని వల్ల నా బతుకు బుగ్గిపాలైంది.. బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్!
Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని వారుండరు. తను ఎంత సక్సెస్ ఫుల్ కెప్టెనో అందరికీ తెలిసిందే. ఇండియాకు రెండు వరల్డ్ కప్‌లు తెచ్చిన ఘనుడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ కొట్టాడు. అంతేకాదు, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. టెస్టుల్లో అయితే మన టీమ్‌ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు.
భారతదేశంలో ధోనిని దేవుడిలా చూసేవాళ్లు కోట్లలో ఉంటారు. కానీ మొన్నామధ్య ఒక హీరోయిన్ ధోని గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడి వల్లే తన జీవితం నాశనమైపోయిందంటూ ఒక బాంబు పేల్చింది. ఎవరా హీరోయిన్? ఏం జరిగిందో చూద్దాం. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయాడు. ఆ టైమ్‌లో చాలా మంది హీరోయిన్లతో అతడు డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో ధోని చాలా కాలం ప్రేమలో ఉన్నాడని టాక్ వినిపించింది.
అంతేకాకుండా, మన సౌత్ హీరోయిన్ లక్ష్మీ రాయ్‌తో కూడా ధోని డేటింగ్ చేస్తున్నట్లు చాలా మీడియాలో కోడై కూశాయి. వీళ్లిద్దరూ కలిసి పబ్బులు, పార్టీలంటూ తిరిగారని కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా హీరోయిన్ లక్ష్మీ రాయ్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ధోని వల్ల తన జీవితంలో ఒక పెద్ద మచ్చ ఏర్పడిందట. ధోనితో తన రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథలు వినిపించాయని, ఇప్పటికీ ఆ వార్తలు వస్తూనే ఉన్నాయని ఆమె బాధపడింది.
రేపు తనకు పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా వాళ్లు ఈ విషయం గురించే తనను అడిగే అవకాశం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి అంటూ తన బాధను చెప్పుకుంది. ధోనితో తన బంధం తన జీవితంలో ఒక మరకలాగా మిగిలిపోయిందని లక్ష్మీ రాయ్ కామెంట్స్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది.