Viral Video: వాగుపై యువతి సాహసం.. చివరికి ఏమైందంటే. షాకింగ్ వీడియో

సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతకు రీల్స్ పై మోజు చూపుతోంది.

Mokshith
Updated on: 9 May 2025 5:45 PM IST
Viral Video: వాగుపై యువతి సాహసం.. చివరికి ఏమైందంటే. షాకింగ్ వీడియో
X

Viral Video: వాగుపై యువతి సాహసం.. చివరికి ఏమైందంటే. షాకింగ్ వీడియో

Viral Video: సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతకు రీల్స్ పై మోజు చూపుతోంది. ఎలాగైనా పాపులర్ అవ్వాలి, ఇందుకోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు మెజారిటీ ఇలాగే ఆలోచిస్తున్నారు. త్వరగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలామంది రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదికి తీసుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి రీల్స్ కోసం సాహసోపేతమైన విన్యాసాలు చేయాలని అనుకుంది. ఆమె పొంగిపొర్లుతున్న వాగుపై ఉన్న ఒక కొమ్మపై నిలబడి స్టంట్స్ చేయడం మొదలుపెట్టింది. చేతులు, కాళ్లు వేసి, నడుమును పైకి లేపుతూ అదిరిపోయే యోగాసనంలా కనిపించే ఒక పొజిషన్‌లోకి వెళ్లింది. అయితే నిమిషం కూడా ఆ స్థితిలో ఉండకముందే, ఒక్కసారిగా అదుపుతప్పి కొమ్మపై నుంచి నీటిలో పడిపోయింది.

ఆమె ఒక్కసారిగా కింద పడిపోవడమే కాకుండా, వేగంగా పొంగుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వీడియో ఇక్కడితో ముగుస్తుంది. ఆమె పరిస్థితి ఎలా ఉందో, ప్రాణాలతో బయటపడిందో అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మరో వ్యక్తి ఎవరూ లేరన్న విషయం స్పస్టమవుతోంది.

యువతి స్వయంగా తన వీడియోను తానే రికార్డ్ చేసుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటివి చేయకండి.. జీవితం ముఖ్యమంటూ’’ ఒకరు రాసారు. ‘‘ఫేమ్ కోసం ప్రాణాలను పణంగా ఇలానే అవుతుంది’’ అని మరొకరు విమర్శించారు.

Mokshith

Mokshith

Next Story