Rohit Sharma : టీమిండియా పోయినా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు మరో జట్టు కెప్టెన్సీ
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించినప్పటికీ తన క్రేజ్ మాత్రం తగ్గలేదు.
Rohit Sharma : టీమిండియా పోయినా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు మరో జట్టు కెప్టెన్సీ
Rohit Sharma : టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించినప్పటికీ తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా తన ఆల్-టైమ్ బెస్ట్ టీ20 జట్టును ఎంపిక చేయగా, ఆ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకోవడం విశేషం. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నప్పటికీ, సికందర్ రజా తన జట్టుకు రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో అతనికి దక్కిన గౌరవం ఎంత గొప్పదో అర్థమవుతోంది.
సికందర్ రజా తన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీ20 జట్టులో అనేక మంది గ్లోబల్ లెవల్ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మతో పాటు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్‌ను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్కు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా ఏబీ డివిలియర్స్, హెన్రిక్ క్లాసెన్, కైరన్ పొలార్డ్ వంటి పవర్ హిట్టర్లకు చోటు కల్పించాడు. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు అవకాశం లభించగా, ఆశ్చర్యకరంగా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు ఈ జట్టులో లేకపోవడం గమనార్హం.
సికందర్ రజా టీ20 ఆల్-టైమ్ XI
క్రిస్ గేల్, రోహిత్ శర్మ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, హెన్రిక్ క్లాసెన్, కైరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, షాహిద్ అఫ్రిది, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, మిచెల్ స్టార్క్,
ఒకవైపు సికందర్ రజా తన ఆల్-టైమ్ జట్టుకు రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నప్పటికీ, భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌పై ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో 2027 ప్రపంచ కప్ వరకు అతను టీమ్ ఇండియాలో కొనసాగడం కష్టంగా మారవచ్చు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే, రోహిత్ దీన్ని ఒక సవాలుగా స్వీకరించి, తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. అతను దాదాపు 15 కిలోల బరువు తగ్గడం క్రికెట్ పై తనకున్న డెడికేషన్ సూచిస్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ భారీగా పరుగులు చేస్తే, అతన్ని జట్టు నుంచి తప్పించడం సెలెక్టర్లకు చాలా కష్టమవుతుంది.