Ind vs Eng : మాంచెస్టర్ టెస్ట్ ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. బుమ్రా, పంత్‌లపై బిగ్ అప్‌డేట్
Ind vs Eng : ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లార్డ్స్ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ వేలికి గాయం అయ్యింది.
Ind vs Eng : మాంచెస్టర్ టెస్ట్ ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. బుమ్రా, పంత్‌లపై బిగ్ అప్‌డేట్
Ind vs Eng : ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లార్డ్స్ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ వేలికి గాయం అయ్యింది. అయినప్పటికీ, అతను రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జూలై 23 నుండి ప్రారంభం కానున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి ఒక పెద్ద నివేదిక బయటకొచ్చింది. ఈ నివేదిక ప్రకారం, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా మాంచెస్టర్‌లో జరగనున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొనవచ్చు. ఇది టీమిండియాకు పెద్ద ఊరట.
టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ముందే, భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా జస్‌ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే పాల్గొంటారని ధృవీకరించారు. అయితే, ఆయన మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లలో ఆడారు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లు తీసుకోగా, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో బూమ్రా మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు నాలుగో టెస్ట్‌లో కూడా బుమ్రా ఆడుతూ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే, టెస్ట్ సిరీస్‌లో కొనసాగాలంటే టీమిండియాకు నాలుగో మ్యాచ్ గెలవడం అత్యవసరం. సిరీస్‌లో పుంజుకోవాలంటే బుమ్రా వంటి కీలక బౌలర్ ఉండటం చాలా అవసరం. అతని అనుభవం, వికెట్లు తీసే సామర్థ్యం జట్టుకు చాలా కీలకం.
రిషబ్ పంత్ విషయానికి వస్తే గాయమైనా లార్డ్స్ టెస్ట్‌లో అతను బ్యాటింగ్ చేశాడు. పంత్ గాయం తీవ్రమైనది కాదా అని అభిమానుల మదిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, అతను కూడా నాలుగో టెస్ట్‌లో ఆడుతూ కనిపించే అవకాశం ఉంది. రిషబ్ పంత్ లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులే చేయగలిగాడు. అంతకుముందు, అతను మొదటి టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించాడు, కాగా రెండో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ ఫామ్ జట్టుకు చాలా కీలకమైనది. కాబట్టి అతను అందుబాటులో ఉండడం గుడ్ న్యూస్.
ఈ రెండు జట్ల మధ్య లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో టెస్ట్‌ను ఇండియా 336 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌ను గెలుచుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌ను గెలిచిన తర్వాత, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్, కాబట్టి కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం.