BCCI: బీసీసీఐలో మళ్లీ మొదలైన ఎన్నికల హడావుడి

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం (BCCI SGM)ను ఏర్పాటు చేయనుంది.

Update: 2025-02-07 10:21 GMT

BCCI: బీసీసీఐలో మళ్లీ మొదలైన ఎన్నికల హడావుడి

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం (BCCI SGM)ను ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశం మార్చి 1న ముంబైలో జరుగుతుంది. ఈ సమావేశంలోనే కొత్త జాయింట్ సెక్రటరీ పేరును ఖరారు చేస్తారు. ఈ సమావేశం ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మధ్యలో జరగనున్నందున ఈ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీసీఐ నియమం ప్రకారం ఒక పదవి ఖాళీ అయినప్పుడల్లా, 45 రోజుల్లోపు కొత్త నియామకం జరగాలి.

జాయింట్ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా పదోన్నతి పొందడంతో ఈ పదవి చాలా కాలంగా ఖాళీగా ఉంది. దీంతో ఈ పదవిని భర్తీ చేసే నిమిత్తం అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఆదేశాలు పంపారు. జారీ చేసిన నోటీసులో మార్చి 1న మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సాధారణంగా ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి 21 రోజుల నోటీసు జారీ చేయడం ఆనవాయితీ. బోర్డు అవే నియమాలను మొదటి నుంచి పాటిస్తుంది. ఇది కేవలం 2 నెలల్లో జరిగిన రెండవ ప్రత్యేక సర్వసభ్య సమావేశం.. చివరి సమావేశం జనవరి 12న జరిగింది. ఆ సమయంలో కార్యదర్శి , కోశాధికారి పదవులకు కొత్త నియామకాలు జరిగాయి.

జాయింట్ సెక్రటరీ పదవి నియామకం కోసం మార్చి 1న సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవిజిత్ సైకియా జాయింట్ సెక్రటరీ నుంచి కార్యదర్శిగా నియమితులైనప్పుడు జాయింట్ సెక్రటరీ పదవి ఖాళీగా ఉంది. జై షా స్థానంలో దేవ్‌జిత్ బీసీసీఐ కార్యదర్శి పదవిని చేపట్టారు. బోర్డు కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా, కొత్త కోశాధికారిగా ప్రభతేజ్ సింగ్ ఎన్నికయ్యారు. కానీ జాయింట్ సెక్రటరీ పదవిని ఇంకా భర్తీ చేయలేదు.

దేవ్జిత్ సైకియా (కార్యదర్శి), ప్రభతేజ్ సింగ్ (కోశాధికారి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ పదవి నియామకం కూడా ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తుంది. నామినేషన్లు దాఖలు చేసే ముందు బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వెస్ట్ జోన్ నుండి ఒకరికి జాయింట్ సెక్రటరీ పదవి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News