IND vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
IND vs AUS: చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఆసీస్ తొలి ఫైట్
IND vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
IND vs AUS: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ సమరానికి రంగం సిద్ధమైంది. సొంత గడ్డపై...తొలిపోరును మొదలుపెట్టబోతోంది రోహిత్ సేన. చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఆసీస్ తొలి ఫైట్ జరగబోతోంది. ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయబోతోంది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది.
వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డెంగ్యూతో శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌కు దూరం అయ్యారు. గిల్ స్థానంలో ఇషాంత్ కిషన్ రంగంలోకి దిగుతున్నారు. చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దింపుతున్నారు రోహిత్. భారత్ తుది జట్టులో రోహిత్, ఇషాంత్, కోహ్లీ.. రాహుల్, అయ్యార్, పాండ్యా, జడేజా, అశ్విన్ కుల్దీప్, బూమ్రా, సిరాజ్ ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌లో 12 సార్లు తలపడిన భారత్, ఆసీస్కంగారులు 8, టీమిండియా 4 మ్యాచ్‌లో విజయం వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ లాంటి పటిష్ట జట్టుతో ఢీ.