Ajinkya Rahane: రంజి ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో అజింక్యా రహానే మ్యాజిక్

Ajinkya Rahane: హర్యానాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై తరఫున కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్య రహానే అద్భుతమైన సెంచరీ సాధించాడు.

Update: 2025-02-11 05:29 GMT

Ajinkya Rahane: రంజి ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో అజింక్యా రహానే మ్యాజిక్

Ajinkya Rahane: హర్యానాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై తరఫున కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్య రహానే అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతను ఈ సెంచరీని రెండవ ఇన్నింగ్స్‌లో సాధించాడు. 160వ బంతికి రహానే 12 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని సెంచరీతో మ్యాచ్‌పై ముంబై జట్టు పట్టు సాధించింది. రహానే తన సెంచరీ పూర్తి చేసే సమయానికి, హర్యానాపై ముంబై 300 పరుగుల ఆధిక్యంలో ఉంది.

రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 50 పరుగుల వ్యవధిలో తొలి రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మూడవ వికెట్ 100 పరుగుల స్కోరుకు ముందే పడిపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడడమే కాకుండా దానికి కొత్త దిశానిర్దేశం చేశాడు. ఇదే క్రమంలో రహానేకు సూర్యకుమార్ యాదవ్, శివం దూబే నుండి కూడా మంచి మద్దతు లభించింది.

సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రహానే నాలుగో వికెట్ కు 129 పరుగులు జోడించి ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ 86 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఆ తర్వాత, రహానే ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ శివం దూబేతో కూడా బాగా రాణిస్తున్నాడు. ఈ భాగస్వామ్యం సమయంలోనే రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మరో సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇది తనకు 41వ సెంచరీ.

అంతకుముందు, రహానే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది. తనుష్ కోటియన్ (97), షమ్స్ ములాని (91) అత్యధికంగా రాణించారు. ముంబై జట్టు 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హర్యానా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకే ఆలౌట్ అయింది. అంకిత్ కుమార్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబైకి 14 పరుగుల ఆధిక్యం లభించింది.

Tags:    

Similar News